సరిలేరు నీకెవ్వరు సెన్సార్ టాక్

Published on Jan 03,2020 04:15 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యు / ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. ఇక సెన్సార్ పూర్తి కావడంతో టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఇంతకీ సరిలేరు నీకెవ్వరు సెన్సార్ టాక్ ఏంటో తెలుసా ?.......  బ్లాక్ బస్టర్ అని అంటున్నారు. సంక్రాంతి పండగ సందర్బంగా జనవరి 11 న విడుదల అవుతున్న ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది.

ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా యాక్షన్ , సెంటిమెంట్ అన్ని అంశాలను రంగరించి మరీ సమతూకంలో వండాడట దర్శకుడు అనిల్ రావిపూడి. మహేష్ బాబు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని సెన్సార్ టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు ఆర్మీ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషించింది. 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి పాత్ర ఈ చిత్రంలో హైలెట్ గా ఉందట. పండగకు అద్భుతమైన విజయాన్ని సాధించే చిత్రంగా సరిలేరు నీకెవ్వరు నిలవడం ఖాయమని అంటున్నారు. మరి ఈ టాక్ నిజం అవుతుందా ? లేదా ? అన్నది మాత్రం జనవరి 11 నే తేలనుంది.