సరిలేరు నీకెవ్వరు 100 కోట్ల బిజినెస్

Published on Dec 13,2019 10:26 PM

మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం 100 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు చిత్రం అంటే హాట్ కేకు అందునా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడం అందునా దిల్ రాజు ఈ చిత్ర నిర్మాణ భాగస్వామి కావడంతో 100 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిన ఈ చిత్రంలో ఒక్కగానొక్క ఐటెం సాంగ్ మాత్రం బ్యాలెన్స్ గా ఉండే దాన్ని కూడా తమన్నా తో కంప్లీట్ చేసాడు దర్శకులు అనిల్ రావిపూడి. మహేష్ బాబు - తమన్నా లపై ఐటెం సాంగ్ కంప్లీట్ కావడంతో ఇక సినిమా విడుదల కావడమే ఆలస్యం అన్నట్లుగా ఉంది.

రాయలసీమ , నైజాం , ఈస్ట్ , వెస్ట్ , నెల్లూరు , కృష్ణా , గుంటూరు , కర్ణాటక , వైజాగ్ , ఓవర్ సీస్ ఇలా అన్ని విభాగాల్లో కలిపి 100 కోట్ల పైచిలుకు లెక్కలు తేలాయట! ఇక వీటికి తోడు శాటిలైట్ రైట్స్ , డిజిటల్ రైట్స్ , హిందీ డబ్బింగ్ రైట్స్ , ఉండనే ఉన్నాయి. మొత్తానికి సరిలేరు నీకెవ్వరు హిట్ అని చెప్పాలంటే బయ్యర్లకు 100 కోట్ల షేర్ రావాలన్న మాట. 100 కోట్ల షేర్ అంటే ఏకంగా ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ వసూళ్ళని సాధించాలి. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 11 న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.