100 కోట్ల బడ్జెట్ తో సరిలేరు నీకెవ్వరు

Published on Dec 07,2019 05:47 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం 100 కోట్ల బడ్జెట్ ని టచ్ చేసినట్లు తెలుస్తోంది. మేకింగ్ కోసమే 30 కోట్లు దాటిందట! ఆ తర్వాత చిత్రంలోని నటీనటులకు అందరికీ కలిపి 55 కోట్లకు పైగా అయ్యిందట రెమ్యునరేషన్. అలాగే ప్రమోషన్స్ ఎలాగూ ఉంటాయి దాంతో ఈ సినిమాని అమ్మాలంటే వంద కోట్లకు పైగానే అమ్మాలి. థియేట్రికల్ రైట్స్ ని వంద కోట్లకు పైగా అమ్మితేనే నిర్మాతతోపాటుగా నిర్మాణ భాగస్వామి గా ఉన్న మహేష్ బాబు కు కూడా లాభాలు వస్తాయి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు మేజర్ ఆర్మీ అధికారిగా నటిస్తున్నాడు అయితే కర్నూల్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది. మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా కీలక పాత్రలో విజయశాంతి నటిస్తోంది. ఇక విలన్ గా ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. జనవరి 11 న భారీ ఎత్తున విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.