సరిలేరు నీకెవ్వరు 6 రోజుల ఏపీ టిఎస్ కలెక్షన్స్

Published on Jan 17,2020 03:47 PM

మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు రెండు తెలుగు రాష్ట్రాలలో 6 రోజుల్లోనే దాదాపు 78 కోట్ల షేర్ కలెక్ట్ చేసి నాన్ బాహుబలి రికార్డులను బద్దలుకొట్టింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు , అనిల్ సుంకర లతో కలిసి మహేష్ బాబు నిర్మించాడు. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11 న భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్ళని సాధిస్తోంది. ఓవర్ సీస్ లో 2 మిలియన్ క్లబ్ ని దాటేలా కనిపిస్తోంది. ఇప్పటికే 2 మిలియన్ దరిదాపుల్లో ఉంది సరిలేరు నీకెవ్వరు. ఇక రాబోయే రోజుల్లో రెండున్నర మిలియన్ డాలర్లని అవలీలగా దాటేలా కనిపిస్తోంది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బాగానే వసూల్ చేస్తోంది. కేవలం 6 రోజుల్లోనే 77కోట్ల 94 లక్షల షేర్ వసూల్ చేసాడు మహేష్ బాబు. సంక్రాంతి సెలవులు మహేష్ కు బాగా కలిసి వచ్చాయి దాంతో భారీ వసూళ్లు సాధిస్తున్నాడు మహేష్ బాబు. ఏరియాల వారీగా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాం                         -  25. 65 కోట్ల షేర్

సీడెడ్                          -  11. 35 కోట్లు

కృష్ణా                           -  6. 27 కోట్లు

గుంటూరు                    -  7. 72 కోట్లు

ఈస్ట్                             -  7. 23 కోట్లు

వెస్ట్                              -   5. 06 కోట్లు

ఉత్తరాంధ్ర                   -  11. 8 కోట్లు

నెల్లూరు                        -  2. 86 కోట్లు

మొత్తం                         -  77. 94 కోట్ల షేర్