100 కోట్ల క్లబ్ లో సరిలేరు నీకెవ్వరు

Published on Jan 13,2020 04:40 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం తక్కువ సమయంలోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. మొదటి రోజునే 55 కోట్ల గ్రాస్ వసూళ్ళని ప్రపంచ వ్యాప్తంగా వసూల్ చేసిన ఈ చిత్రం రెండో రోజున కూడా అదే జోరు ప్రదర్శించింది. దాంతో రెండో రోజున కూడా దాదాపు 40 కోట్ల వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది అంటే రెండు రోజుల్లోనే 90 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయన్న మాట! దాంతో ఈరోజు తో 100 కోట్ల పైచిలుకు కలెక్షన్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఏ తెలుగు చిత్రం కూడా ఇంత తక్కువ సమయంలో 100 కోట్ల మార్క్ ని అందుకున్న దాఖలాలు లేవు.

ఆ అరుదైన రికార్డ్ ని మహేష్ బాబు సొంతం చేసుకున్నాడు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో అనిల్ కూడా సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు. ఇప్పటివరకు అనిల్ కెరీర్ లో హిట్స్ ఉన్నాయి కానీ ఇలాంటి బ్లాక్ బస్టర్ అయితే లేదు దాంతో అనిల్ రావిపూడి కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక లేడీ అమితాబ్ విజయశాంతి సంతోషానికి అవధులు లేకుండాపోయాయి ఈ విజయంతో. మూడు రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో అవలీలగా 220 కోట్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.