లిప్ లాక్ లతో షాక్ ఇచ్చిన సారా అలీఖాన్

Published on Jan 18,2020 12:22 PM

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ లిప్ లాక్ సీన్లలో వీర లెవల్లో రెచ్చిపోయి నటించి షాక్ ఇచ్చింది. తండ్రి స్టార్ హీరో కాబట్టి ఇలా లిప్ లాక్ సీన్లలో నటించకపోవచ్చు అని అనుకున్నారు కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ''లవ్ ఆజ్ కల్ '' చిత్రంలో సారా అలీఖాన్ లిప్ లాక్ సన్నివేశాల్లో నటించి షాక్ ఇచ్చింది. హీరో కార్తీక్ ఆర్యన్ తో ఇంటిమేట్ సీన్స్ లో కూడా రెచ్చిపోయి నటించింది సారా అలీఖాన్. తాజాగా లవ్ అజ్ కల్ చిత్ర ట్రైలర్ విడుదల అయ్యింది. ఆ ట్రైలర్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం మరి.

శృంగార సన్నివేశాల్లో అలవోకగా నటించడమే కాకుండా లిప్ లాక్ సీన్స్ లో అయితే కుర్రాళ్ళు ఈర్ష్య పడేలా నటించి సారీ ..... జీవించి పిచ్చెక్కిస్తోంది. ట్రైలర్ లోనే ఇలా ఉంటే సినిమా ఇక ఏ రేంజ్ లో ఉంటుందో అన్న అనుమానం తలెత్తక మానదు. పైగా బాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రాల ధోరణి మరీ ఎక్కువయ్యింది. లవ్ ఆజ్ కల్ చిత్రంతో సారా సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.