సారా బికినీపై నెటిజన్ల ఫైర్

Published on Mar 09,2020 05:03 PM

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ బికినీ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బికినీ వేసుకుంటే ఆమె అందాలను చూస్తూ పరవశించి పోకుండా సారా అలీఖాన్ ని విమర్శించడం ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారా ? సారా అలీఖాన్ బికినీ వేసుకుంటే తప్పులేదు కానీ తన తమ్ముడు ఇబ్రహీం తో కలిసి బికినీ ఫోజులు ఇచ్చింది. తమ్ముడితో కలిసి బికినీ ధరించి ఫోటోలకు ఫోజివ్వడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దాంతో తమ్ముడితో కలిసి ఇలాగేనా ఫోటోలకు ఫోజిచ్చేది అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు నెటిజన్లు.

సైఫ్ అలీఖాన్ - అమృతాసింగ్ ల కూతురైన సారా అలీఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక బికినీ వేషాలు వీర లెవల్లో వేస్తోంది ఈ భామ. సింగిల్ గానో లేక బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడో బికినీ వేస్తే అర్ధం కానీ తమ్ముడితో ఉన్నప్పుడు బికినీ వేయడం ఏంటి ? ఫోజులు కొట్టడం ఏంటి ? అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సారా అలీఖాన్ మీద.