ఇద్దరు హీరోల మధ్య చిచ్చు పెట్టిన సంక్రాంతి

Published on Mar 01,2020 03:43 PM

సంక్రాంతి పండగ ఇద్దరు స్టార్ హీరోల మధ్య చిచ్చు పెట్టింది. ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు , అల ...... వైకుంఠపురములో రెండు చిత్రాలు విడుదల అయ్యాయి. ఒక రోజు తేడాలో రెండు భారీ సినిమాలు విడుదల కావడం వల్ల ఫ్యాన్స్ మధ్య జరిగిన పోటీ ఇద్దరు హీరోల వరకు వెళ్ళింది. దాంతో మా సినిమా గొప్ప అంటే మా సినిమా గొప్ప అంటూ ప్రచారం చేసుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ రెండు సినిమాలు 50 రోజులు పూర్తి చేసుకోవడంతో ఇపుడు కూడా మాదే బ్లాక్ బస్టర్ అంటే మాదే బ్లాక్ బస్టర్ అంటూ మళ్ళీ లొల్లి షురూ చేసారు.

ఈ లొల్లి సరిపోనట్లు తాజాగా చిరంజీవి సినిమాలో మహేష్ బాబు కీలక పాత్ర పోషిస్తుండటంతో అతడ్ని ఎందుకు తీసుకున్నారు అంటూ అల్లు కుటుంబంలో అలజడి మొదలయ్యిందట. పైగా భారీ రెమ్యునరేషన్ కూడా ఇస్తుండటంతో మెగా - అల్లు కుటుంబాల్లో కలతలు మొదలయ్యాయని గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిలిం నగర్ సర్కిల్లో. చరణ్ చేయాల్సిన పాత్రని మహేష్ చేత చేయించడం ఎందుకు ? అని భావిస్తున్నారట అల్లు కాంపౌండ్.