ఆ హీరో బయోపిక్ నుండి ఎందుకు తప్పుకున్నట్లు

Published on Nov 27,2019 02:48 PM

యంగ్ హీరో సందీప్ కిషన్ ఉదయ్ కిరణ్ బయోపిక్ చేస్తున్నట్లు రకరకాల కథనాలు మీడియాలో వచ్చాయి కట్ చేస్తే నేను ఉదయ్ కిరణ్ బయోపిక్ చేయడం లేదు , అసలు బయోపిక్ ల పై నాకు అంతగా ఆసక్తి లేదు అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు యంగ్ హీరో సందీప్ కిషన్. అయితే ఈ హీరో ఇలా స్టేట్ మెంట్ ఇవ్వడానికి కారణం మెగా కాంపౌండ్ తో అనవసరంగా గోక్కోవడం ఎందుకు ? అనే సందీప్ కిషన్ ఉదయ్ కిరణ్ బయోపిక్ నుండి తప్పుకున్నాడంటూ ఊహాగానాలు చెలరేగాయి.

ఉదయ్ కిరణ్ బయోపిక్ అంటే తప్పకుండా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు తో జరిగిన ఎంగేజ్ మెంట్ , పెళ్లి రద్దు వ్యవహారం ఉండాల్సిందే సినిమాలో. ఆ సీన్స్ ఉంటే ఖచ్చితంగా మెగా కాంపౌండ్ నుండి వ్యతిరేకత రావడం ఖాయం. అందుకే వాళ్ళ తో పెట్టుకోవడం ఎందుకు అని భావించి బయోపిక్ నుండి సందీప్ కిషన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే బయటకు మాత్రం ఆ బయోపిక్ గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు అంటూ కలర్ ఇస్తున్నాడు సందీప్ కిషన్.