ఉదయ్ కిరణ్ బయోపిక్ లో సందీప్ కిషన్

Published on Nov 26,2019 11:03 AM

చిన్న వయసులోనే హీరోగా సంచలన విజయాలు అందుకున్న యంగ్ హీరో ఉదయ్ కిరణ్. వరుసగా మూడు సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి సంచలనం సృష్టించిన ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతాడని అనుకుంటే సడెన్ గా ఉదయ్ కిరణ్ జీవితం అల్లకల్లోలం అయిన విషయం తెలిసిందే. ఆ అవమానాలతో బతకలేక అర్దాంతరంగా తనువు చాలించాడు. ఇప్పుడు అదే కథతో ఉదయ్ కిరణ్ బయోపిక్ చిత్రం రూపొందనుంది.

ఇక ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నది ఎవరో తెలుసా ....... యంగ్ హీరో సందీప్ కిషన్. ఉదయ్ కిరణ్ పాత్రలో సందీప్ కిషన్ నటించడానికి సిద్ధం అవుతున్నాడు. ఉదయ్ కిరణ్ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి దాంతో ఈ బయోపిక్ కు సన్నాహాలు చేస్తున్నారు. అసలే బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది తెలుగునాట. ఇక ఈ బయోపిక్ ఎంతటి సంచలనం సృస్టించనుందో చూడాలి. సందీప్ కిషన్ కెరీర్  కు కూడా ఈ సినిమా తప్పకుండా ఉపయోగపడనుంది.