సెక్స్ సీన్స్ చేయనని చెప్పాడట

Published on Oct 25,2019 04:36 PM

అర్జున్ రెడ్డి , కబీర్ సింగ్ లాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రాలకు దర్శకత్వం వహించి విమర్శల తో పాటుగా ప్రశంసలు కూడా అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. కమర్షియల్ గా ఆ రెండు చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి కానీ అదే స్థాయిలో విమర్శలు వచ్చాయి ఇతడి పైన ఎందుకంటే అడల్ట్ కంటెంట్ అంటూ కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెక్స్ సీన్స్ ఎక్కువగా ఉండే ఓ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించమని బ్రహ్మాండమైన ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసాడట సందీప్ రెడ్డి వంగా.

అడల్ట్ కంటెంట్ తో వచ్చే వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించమంటే నో చెప్పడం ఏంటి ? అని అందరూ ఆశ్చర్య పోతున్నారు కానీ ఒక్క టాలీవుడ్ సినిమాతో సంచలనం సృష్టించి అదే చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసి ప్రభంజనం సృష్టించాడు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా రేంజ్ వేరు కాబట్టి వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించాల్సిన అవసరం లేదు కదా !