పుకార్లని ఖండించిన కన్నడ స్టార్ హీరో యష్

Published on Mar 11,2019 11:36 AM

ఇటీవలే కేజీఎఫ్ చిత్రంతో సౌత్ ఇండియాలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న హీరో యష్ అయితే ఈ హీరో ని హత్య చేయడానికి సుపారీ తీసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో వెంటనే అప్రమత్తమైన హీరో యష్ నేను ఎవరికీ అపకారం చేయలేదు , అలాగే మా కన్నడ చిత్ర పరిశ్రమలో నన్ను హత్య చేసేంత శత్రుత్వం లేదు కాబట్టి నా ప్రాణాలకు వచ్చిన ముప్పు ఏమి లేదు దయచేసి మీడియాలో వస్తున్న వార్తలను ఆపేయండి అంటూ మీడియా ముందుకు వచ్చాడు యష్ . 

ఓ సాధారణ కుటుంబం నుండి వచ్చాడు యష్ , అయితే అనూహ్యంగా కన్నడ చిత్ర రంగంలో ఎవరూ ఊహించని స్టార్డం అందుకున్నాడు . దానికి తోడు గత ఏడాది యష్ నటించిన కేజీఎఫ్ ప్రభంజనం సృష్టించడంతో యష్ కు ఎనలేని క్రేజ్ వచ్చి పడింది దాంతో ఈ పుకార్లు షికారు చేస్తున్నాయి . అయితే వస్తున్నవన్నీ పుకార్లు మాత్రమేనని నాకు ఎలాంటి ప్రాణహాని లేదని అంటున్నాడు యష్ .