రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ లో తమిళ దర్శకుడు

Published on Jan 29,2019 01:13 PM

ఓటమి ఎరుగని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . బాహుబలి సిరీస్ ల తర్వాత రాజమౌళి ఖ్యాతి ప్రపంచ స్థాయిలో మారుమ్రోగింది దాంతో ఈ దర్శకుడి సినిమాలో నటించడానికి పలువురు నటీనటులు పోటీ పడుతుంటారు . ఇక ఛాన్స్ వస్తే వదులుకుంటారా ? అలాగే తమిళ దర్శకుడు , నటుడు సముద్రఖని కూడా వచ్చిన చాన్స్ ని వదలలేదు ఆర్ ఆర్ ఆర్ లో నటించే గిల్డెన్ ఛాన్స్ రాగానే వెంటనే ఒప్పుకున్నాడు . 

తమిళ నటుడైన సముద్రఖని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే ! పలు తమిళ చిత్రాలు తెలుగులో డబ్ కాగా ఆ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు ఈ నటుడు కం దర్శకుడు . ఆర్ ఆర్ ఆర్ లో ఒక విలన్ గా సముద్రఖని నటిస్తున్నాడు . ఇక హీరోయిన్ గా బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది . ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలు అన్న విషయం తెలిసిందే .