కారు ప్రమాదానికి గురైన సంపూర్ణేష్ బాబు

Published on Nov 27,2019 03:15 PM

విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. సంఘటన వివరాలలోకి వెళితే ....... సంపూర్ణేష్ బాబు తన భార్య పిల్లలతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు వచ్చి వేగంగా గుద్దడంతో కారు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో సంపూర్ణేష్ బాబు కు అలాగే అతడి భార్యకు కూతురు కు స్వల్ప గాయాలయ్యాయి. 
           ఈ సంఘటన సిద్ధిపేట లో జరిగింది. సిద్ధిపేట కొత్త బస్టాండ్ లో ఈ ప్రమాదం జరిగింది. సంపూర్ణేష్ బాబు కు స్వల్ప గాయాలు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తెలుగులో సంపూ పలు చిత్రాల్లో హీరోగా నటించిన విషయం తెలిసిందే.