మరో సినిమాకు రెడీ అవుతున్న సంపూ

Published on Aug 24,2019 11:20 AM
సంపూర్నేష్ బాబు తాజాగా కొబ్బరిమట్ట తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే . కాగా ఇప్పుడు మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు . హృదయ కాలేయం , కొబ్బరిమట్ట చిత్రాలతో సంచలనం సృష్టించిన సంపూ మళ్ళీ అదే కాంబినేషన్ లో కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు . వెండితెర పై సంపూ ఒక సంచలనంగా మారాడు . సెటైరికల్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన కొబ్బరిమట్ట లాగే మరో సెటైరికల్ కామెడీ కి శ్రీకారం చుడుతున్నారు . 

సంపూర్నేష్ బాబు కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . కొబ్బరిమట్ట విజయం సాధిస్తుందో ? లేదో ? మళ్ళీ సినిమా సినిమా చేస్తామో ? లేదో ? అన్న అనుమానం ఉండేది వాళ్ళలో ! కానీ కొబ్బరిమట్ట మంచి వసూళ్లు సాధించడంతో మరో సినిమా కి రెడీ అవుతున్నారు .