నిర్మాతగా మారుతున్న సమంత

Published on Apr 30,2020 04:57 PM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారుతోంది. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనే తలంపుతో కొత్త ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది సమంత. 2010 లో వచ్చిన ఏమాయ చేసావే చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సమంత. ఆ సినిమా నుండి ఇప్పటివరకు పదేళ్ల కెరీర్ ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఇన్నేళ్ల కాలంలో అటు తెలుగులో ఇటు తమిళ్ లో పలు చిత్రాల్లో నటించింది.

ఒకవైపు స్టార్ డం ని అనుభవిస్తూనే మరోవైపు విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అయితే ఇన్నేళ్ల తర్వాత ఓ మంచి నిర్ణయానికి వచ్చింది సమంత. తనని ఇంత పెద్దదాన్ని చేసిన కళామతల్లి ఋణం తీర్చుకోవడానికి సొంత ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేయాలనీ నిర్ణయించుకుంది. తనకు చెందిన పలు నిర్మాణ సంస్థలు ఉన్నప్పటికీ తన అభిరుచి మేరకు ఉండలానే నిర్ణయంతో సొంత ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేస్తోంది. అయితే నిర్మాతగా మారిన పలువురు హీరోయిన్ లు ఆర్ధికంగా నష్టపోయారు . సావిత్రి సహా పలువురు ఉదాహరణలుగా నిలిచారు. వాళ్ళ లా కాకుండా సమంత విజయాలు దక్కించుకోవాలని ఆశిద్దాం .