ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ కు షాక్ ఇచ్చిన సమంత

Published on Feb 18,2020 07:07 PM

సమంత ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతికి షాక్ ఇచ్చింది. మొదటి చిత్రం ఆర్ ఎక్స్ 100 తోనే సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు అజయ్ భూపతికి రెండో సినిమా చేయడానికి రెండేళ్లు పడుతోంది. 2018 లో ఆర్ ఎక్స్ 100 చిత్రం విడుదల అయ్యింది అయితే అప్పటి నుండి పలువురు హీరోలతో సినిమా అనుకున్నాడు కానీ అందరూ ఓకే చేసినట్లే చేస్తూ తీరా సమయానికి హ్యాండ్ ఇస్తున్నారు. దాంతో మహాసముద్రం అనే ప్రాజెక్ట్ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.

తాజాగా మహాసముద్రం నుండి సమంత డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. మహాసముద్రం చిత్రంలో సమంత నటించడానికి అంగీకరించింది. అయితే ఓ తమిళ సినిమాలో ఛాన్స్ రావడంతో దీనికంటే అదే బెటర్ అని భావించిన సమంత అజయ్ భూపతికి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోగా నటించడానికి శర్వానంద్ ఓకే చెప్పాడు. మరి ఈ హీరో అయినా చేస్తాడా ? లేక యితడు కూడా హ్యాండ్ ఇస్తాడా ? చూడాలి.