శర్వానంద్ కు ఎలాంటి ఎఫైర్లు లేవంటున్న సమంత

Published on Feb 05,2020 05:15 PM

హీరో శర్వానంద్ కు ఎలాంటి ఎఫైర్లు లేవని క్లీన్ చిట్ ఇస్తోంది సమంత. శర్వానంద్ కు ఏమైనా ఎఫైర్లు ఉన్నాయేమోనని గూగుల్ లో వెతికిందట సమంత , అయితే శర్వా కు ఎలాంటి ఎఫైర్లు లేవని .... గూగుల్ లో ఎలాంటి ఆధారాలు లేవని వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించింది సమంత. తాజాగా ఈ ఇద్దరూ కలిసి 96 రీమేక్ '' జాను '' చిత్రంలో నటించారు. ఆ సినిమా ఫిబ్రవరి 7 న విడుదల అవుతోంది.

దాంతో ఆ సినిమా ప్రమోషన్ నిమిత్తం రెండు తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తున్నారు చిత్ర బృందం. తాజాగా వైజాగ్ వెళ్లారు సమంత - శర్వానంద్ లు . అక్కడ ఈ హీరోకు క్లీన్ చిట్ ఇచ్చేసింది సమంత. ఎంతసేపు తన పని తానూ చేసుకుంటూ పోతాడని ఎలాంటి ఎఫైర్లు లేని హీరో అంటూ కితాబునిచ్చింది. తమిళంలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో హిట్ అవుతుందా ? లేదా ? అన్నది ఈనెల 7 న తేలనుంది. సమంత వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది అయితే శర్వా కు మాత్రం ఈ సినిమా తప్పకుండా హిట్ కావాల్సిందే మరి.