సమంత సినిమాలకు గుడ్ చెప్పడం లేదట !

Published on Feb 12,2020 02:53 PM

నేను సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయని అయితే నేను చెప్పింది అది కాదని , ఎప్పటికి సినిమాల్లో నటిస్తూనే ఉంటానని అంటోంది. నేను సినిమాల్లోకి వచ్చి ఎక్కువ కాలం అయ్యింది దానికి తోడు నాకు కూడా సంసార జీవితం కావాలని , పిల్లలు కావాలని ఉంటుంది కదా ! అని అది మాత్రమే అన్నానని అయితే సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా దాన్ని సృష్టించారని అంటోంది సమంత.

తాజాగా ఈ భామ జాను అనే చిత్రంలో నటించింది. జాను పాత్రలో జీవించి మంచి మార్కులు కొట్టేసింది సమంత కానీ ఆ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడటం లేదు పాపం. సమంత కు మంచి పేరు అయితే వచ్చింది కానీ కమర్షియల్ గా మాత్రం హిట్ అనిపించుకోలేకపోయింది జాను. గత ఏడాది ఓ బేబీ చిత్రంతో సంచలన విజయం అందుకుంది సమంత. అయితే ఈఏడాది మాత్రం జాను తో ప్లాప్ అందుకుంది.