బయోపిక్ లో నటిస్తానంటున్న సమంత

Published on Dec 30,2019 05:28 PM
రియల్ లైఫ్ లో అనితర సాధ్యమైన విజయాలను సాధించిన వ్యక్తి చిత్రంలో నటించాలని తహతహాలాడుతోంది సమంత. ఇప్పటికే తెలుగులో పలు బయోపిక్ లు వచ్చాయి ఇక మహానటి అనే బయోపిక్ లో సమంత కూడా ఒక హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే మహానటి బయోపిక్ అయినప్పటికీ అందులో సమంత పాత్ర మాత్రం ఒరిజినల్ పాత్ర కాదు కల్పిత పాత్ర అందుకే రియల్ బయోపిక్ లో నటించాలని ఉందని అంటోంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా అవార్డు అందుకుంది సమంత.

ఆ సందర్బంగా సమంత మాట్లాడుతూ బయోపిక్ గురించి తన మనసులోని మాటని బయటపెట్టేసింది. సమంత ఓపెన్ గా ఈ విషయం చెప్పింది కాబట్టి దర్శక నిర్మాతలు ఆ దిశగా ఆలోచిస్తారేమో చూడాలి. ఇక ఈ ఏడాది సమంతకు బాగానే కలిసి వచ్చిందనే చెప్పాలి. మజిలీ చిత్రంతో పాటుగా ఓ బేబీ చిత్రం కూడా మంచి హిట్ అయ్యింది. దాంతో సమంత క్రేజ్ మరింతగా పెరిగింది.