సమంత అయిష్టంగానే ఆ సినిమా చేసిందట

Published on Jan 30,2020 03:38 PM

సమంత తాజాగా '' జాను '' అనే రీమేక్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తమిళంలో సంచలన విజయం సాధించిన 96 చిత్రాన్ని తెలుగులో జాను అనే టైటిల్ తో రీమేక్ చేసారు. శర్వానంద్ హీరోగా నటించగా సమంత హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో సమంత అయిష్టంగానే నటించిందట ! ఎందుకంటే 96 చిత్రం క్లాసికల్ చిత్రం అలాంటి మ్యాజిక్ ని మళ్ళీ రీ క్రియేట్ చేయడం చాలా కష్టం ఏమాత్రం ఎక్కువైనా , తక్కువైనా మొత్తం చెడిపోయే ప్రమాదం ఉంది పైగా చెడ్డ పేరు వస్తుంది అందుకే చేయకూడదు అని అనుకుందట.

అయితే దిల్ రాజు వచ్చి తప్పకుండా నీ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుందని నమ్మకం కలిగించాడట ! దాంతో చేసేది లేక ఒప్పుకుంది. కట్ చేస్తే ఫిబ్రవరి 7 న జాను చిత్రం విడుదల అవుతోంది. తమిళంలో విజయ్ సేతుపతి - త్రిష నటించారు. కెరీర్ బెస్ట్ అందుకున్నారు. మరి సమంత కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 7 వరకు ఆగాల్సిందే.