సల్మాన్ ఖాన్ మేనళ్లుడు మృతి

Published on Apr 01,2020 01:48 PM
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మేనల్లుడు మృతి చెందాడు. దాంతో సల్మాన్ ఖాన్ కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది. 38 ఏళ్ల  అబ్దుల్లా ఖాన్ సల్మాన్ ఖాన్ కు మేనల్లుడు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు అబ్దుల్లా ఖాన్. ముంబై లోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అయితే నిన్న రాత్రి అబ్దుల్లా ఖాన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. దాంతో సల్మాన్ ఖాన్ కుటుంబంలో విషాదం నెలకొంది.

సల్మాన్ ఖాన్ కు మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ అంటే అమితమైన ప్రేమ అందుకే తన కార్యక్రమాలకు అతడ్ని తీసుకెళ్లేవాడు. అంతేకాదు మేనల్లుడుతో కలిసి పలుమార్లు ఎక్సర్ సైజ్ లు చేసాడు సల్మాన్ ఖాన్. అలాగే మేనల్లుడుతో కలిసి వ్యాయామం చేసిన వీడియోలను సోషల్ మీడియాలో కూడా పెట్టాడు సల్మాన్ ఖాన్. ఒకవైపు కరోనా ఎఫెక్ట్ తో యావత్ ప్రపంచం బాధపడుతుంటే సల్మాన్ ఖాన్ కు మరో రకమైన బాధ వచ్చింది.