2 రోజుల్లో 48 కోట్లు వసూల్ చేసిన సల్మాన్

Published on Dec 23,2019 09:07 AM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 చిత్రంతో రెండు రోజుల్లో 48 కోట్ల గ్రాస్ వసూల్ చేసాడు. ఇక ఈరోజు ఆదివారం కావడంతో ఈరోజు కూడా మంచి వసూళ్లు రావడం ఖాయం. దబాంగ్ సిరీస్ లో ఇది మూడో చిత్రం కావడం విశేషం. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ చుల్ బుల్ పాండే గా నటించాడు. సల్మాన్ సరసన సోనాక్షి సిన్హా నటించగా విలన్ గా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించాడు. దబాంగ్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి రివ్యూస్ ఆశించిన స్థాయిలో రాలేదు అయినప్పటికీ దబాంగ్ 3 మాత్రం మంచి ఓపెనింగ్స్ ని సాధిస్తోంది.

మొదటి రోజున 24 కోట్లు వసూల్ చేయగా రెండో రోజున కూడా 24 కోట్లు వసూల్ చేసింది దబాంగ్ 3. ఆదివారం కూడా బాగానే వసూళ్లు ఉంటాయి దాంతో ఈ సినిమా అవలీలగా వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈరోజు ఎలాగూ 20 కోట్ల పైనే ఉంటుంది. అంటే మూడు రోజుల్లోనే 60 కోట్ల పైచిలుకు వసూళ్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. దబాంగ్ స్థాయిలో సినిమా లేదని విమర్శలు వస్తున్నాయి కానీ వసూళ్లు మాత్రం బాగానే వస్తున్నాయి.