డిజిటల్ రైట్స్ లో సంచలనం సృష్టించిన సైరా

Published on Sep 11,2019 07:24 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ సైరా నరసింహారెడ్డి డిజిటల్ రైట్స్ లో సరికొత్త సంచలనం సృష్టించింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ , మలయాళం , తమిళ బాషలలో విడుదల కానుంది దాంతో అన్ని భాషలలో కలిపి సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది అమెజాన్ ప్రైమ్.

ఇంతకీ అమెజాన్ ప్రైమ్ సైరా కోసం చెల్లించిన సొమ్ము ఎంతో తెలుసా ....... 40 కోట్లు . కేవలం డిజిటల్ రైట్స్ కు మాత్రమే ఈ భారీ మొత్తాన్ని అన్ని భాషలలో కలిపి చెల్లించింది అమెజాన్. 40 కోట్ల భారీ మొత్తం కోట్ కావడంతో బిజినెస్ వర్గాల్లో సంచలనంగా మారింది. రాంచరణ్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అక్టోబర్ 2 న విడుదల చేయనున్నారు. అమితాబ్ , నయనతార , జగపతిబాబు , విజయ్ సేతుపతి , సుదీప్ , తమన్నా తదితరులు నటించిన చిత్రం కావడంతో సైరా కు విపరీతమైన క్రేజ్ లభించింది.