సైరా నరసింహారెడ్డి వేడుకలు వాయిదా

Published on Sep 20,2019 05:08 PM

రేపు జరగాల్సిన సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుకలు రద్దు చేసారు , అంతేగాదు ఆ వేడుకలను రేపు కాకుండా సెప్టెంబర్ 22 న భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోగా నదీలో లాంచీ ప్రమాదం జరిగి పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది రెండు తెలుగు రాష్ట్రాలలో. అందుకే సైరా వేడుకలను వాయిదావేశారు.

చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రాంచరణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 2 న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 18 న సైరా ప్రీ రిలీజ్ వేడుక అనుకున్నారు కానీ దాన్ని వాయిదావేసి సెప్టెంబర్ 22 కు వాయిదా వేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రం పై ఆ చిత్ర బృందం చాలా ఆశలు పెట్టుకుంది.