మహేష్ ని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి

Published on Mar 09,2019 11:41 AM

మహేష్ బాబు సినిమాలో నటించమని హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తే రిజెక్ట్ చేసి సంచలనం సృష్టించింది సాయి పల్లవి . ఫిదా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన మలయాళ భామ సాయి పల్లవి . అయితే ఆ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించింది కానీ దర్శక నిర్మాతలకు తలనొప్పిగా తయారయ్యిందట ఈ భామ . తాజాగా మహేష్ బాబు తో అనిల్ రావిపూడి ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు . 

కాగా ఆ చిత్రంలో సాయి పల్లవి ని హీరోయిన్ గా తీసుకుందామని వెళ్లి కలిశాడట అయితే తన క్యారెక్టర్ ఏంటో తెలుసుకున్నాక ఏమాత్రం ఆలోచించకుండా నో చెప్పేసిందట . మహేష్ పక్కన నటించే ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు కానీ సాయిపల్లవి మాత్రం బంగారం లాంటి ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేయడం తో సంచలనం అయ్యింది .