ఓవర్సీస్ లో సాహో నష్టం ఎంతో తెలుసా?

Published on Sep 09,2019 11:03 AM

ఓవర్ సీస్ లో సాహో చిత్రానికి పోటీపడి మరీ 42 కోట్లకు కొన్నారు అయితే అక్కడ ఇప్పటివరకు సాహో ఎంత వసూల్ చేసిందో తెలుసా ...... 18 కోట్లు మాత్రమే ! అంటే 24 కోట్ల నష్టం అన్నమాట ఓవర్ సీస్ బయ్యర్ కు. ప్రభాస్ బాహుబలి తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో సాహో పై భారీ అంచనాలు నెలకొన్నాయి దాంతో బయ్యర్ లు పోటీపడ్డారు దాంతో 42 కోట్ల బిజినెస్ జరిగింది ఓవర్ సీస్ లో.
అయితే ఆగస్టు 30 న విడుదలైన సాహో చిత్రానికి ముందునుండి డివైడ్ టాక్ ఉంది దాంతో ఓపెనింగ్స్ అదిరిపోయినప్పటికీ ఆ తర్వాత బెదిరిపోయాయి కలెక్షన్స్. దాంతో 24 కోట్ల నష్టం వస్తోంది అక్కడి బయ్యర్ కు. ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో ..... యువి క్రియేషన్స్ మీద అలాగే ప్రభాస్ మీద భారం పడనుంది. సుజిత్ దర్శకత్వంలో 350 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో చిత్రం రూపొందిన విషయం తెలిసిందే.