కాపీ ఆరోపణలపై స్పందించిన సాహో డైరెక్టర్

Published on Sep 07,2019 11:27 AM

సాహో దర్శకులు సుజిత్ ఎట్టకేలకు తన సినిమాపై వస్తున్న కాపీ ఆరోపణలపై స్పందించాడు. ఫ్రెంచ్ చిత్రం లార్గో వించ్ చిత్రానికి సాహో కాపీ అని ఆరోపణలు రావడమే కాకుండా నా సినిమాని ఎలాగూ కాపీ చేసారు దాన్ని సరిగ్గా కాపీ చేయడం కూడా రాదా ? అంటూ ఆ చిత్ర దర్శకులు సుజిత్ పై సెటైర్ వేసిన విషయం కూడా తెలిసిందే. తనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో స్పందించిన సుజిత్ లార్గో వించ్ ని కాపీ కొట్టలేదని తేల్చి చెప్పాడు.
అంతేకాదు అసలు నేను ఏ సినిమాని కాపీ చేసానో తెలుసా ........ నేను దర్శకత్వం వహించిన రన్ రాజా రన్ చిత్రాన్ని కాపీ కొట్టానని , రన్ రాజా రన్ చిత్రాన్ని కాస్త మార్చి సాహో చిత్రం చేసానని చాలా సింపుల్ గా చెప్పాడు. తన రెండో సినిమాకే ప్రభాస్ లాంటి స్టార్ హీరో దొరికితే దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి చేజేతులా ప్లాప్ చిత్రాన్ని తీయడమే కాకుండా రన్ రాజా రన్ చిత్రాన్ని మార్చి తీశానని చెప్పడం అంటే బాధ్యతారాహిత్యమే మరి.