పారిపోయిన సాహో దర్శకుడు

Published on Sep 03,2019 01:46 PM

సాహో చిత్రానికి  డిజాస్టర్ టాక్ రావడంతో సాహో దర్శకుడు సుజిత్ గోవా పారిపోయాడు. సినిమా రిజల్ట్ గందరగోళంలో పడటంతో ముందుగానే గోవా వెళ్ళిపోయాడు. అయితే సుజిత్ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా ఇతరులు కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తుండటంతో వాళ్లకు కూల్ గా సమాధానం ఇచ్చాడు. సాహో చాలామందికి నచ్చిందని , అయితే కొంతమందికి నచ్చలేదని అటువంటి వాళ్ళు మళ్ళీ సినిమా చూడాలని హితువు పలుకుతున్నాడు సుజిత్. 
350 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ప్రభాస్ -శ్రద్దా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ , శాండల్ వుడ్ ప్రముఖులు నటించారు. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన సాహో భారీ ఓపెనింగ్స్ సాధించింది , కానీ ఆ తర్వాత కలెక్షన్లు పడిపోయాయి. ఇక ఈ సినిమాని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకులు సుజిత్ పై తీవ్రంగా మండిపడుతున్నారు.