5 రోజుల్లో 350 కోట్లు రాబట్టిన సాహో

Published on Sep 04,2019 02:26 PM
ఆగస్టు 30న భారీ ఎత్తున విడుదలైన సాహో మొత్తంగా 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్ల భారీ వసూళ్లని సాధించింది. ఒకవైపు సాహో చిత్రం పై నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతున్నప్పటికి కలెక్షన్స్ తో మాత్రం సంచలనం సృష్టిస్తూనే ఉంది. నాలుగు రోజుల్లో 330 కోట్లు వసూల్ చేసిన సాహో ఐదో రోజున ప్రపంచ వ్యాప్తంగా మరో 30 కోట్ల వసూళ్ళని సాధించడం విశేషం. 
అయితే నాలుగు రోజుల పాటు అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల భారీ ఓపెనింగ్స్ లభించాయి.కానీ ఐదో రోజున వసూళ్లు గణనీయంగా పడిపోయాయి.సాహో 5 రోజుల్లో 350 కోట్ల కలెక్షన్స్ సాధించడంతో ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి లోనౌతున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. మొత్తానికి ప్రభాస్ మేనియా ప్రపంచ వ్యాప్తం అయ్యింది సాహో రూపంలో. సినిమాకు ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ మంచి వసూళ్లనే సాధిస్తోంది సాహో.