దర్శకులు బోయపాటి ఇంట తీవ్ర విషాదం

Published on Jan 18,2020 02:44 PM

దర్శకులు బోయపాటి శ్రీను ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బోయపాటి శ్రీను తల్లి సీతారావమ్మ (80) నిన్న రాత్రి మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీతారావమ్మ ఆరోగ్యం విషమించడంతో స్వగ్రామంలోనే కన్నుమూశారు. బోయపాటి స్వస్థలం గుంటూరు జిల్లా పెదకాకాని. బోయపాటి శ్రీను హైదరాబాద్ లో ఉంటున్నప్పటికీ తల్లి మాత్రం స్వగ్రామంలోనే ఉంటోంది. తల్లి మరణంతో బోయపాటి శ్రీను దుఃఖసాగరంలో మునిగాడు.

బోయపాటి తల్లి మరణించడంతో పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు బోయపాటికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. ఈరోజు గుంటూరు జిల్లా లోని పెదకాకాని లో సీతారావమ్మ అంత్యక్రియలు జరుగనున్నాయి. మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బోయపాటి ప్రస్తుతం బాలయ్య తో మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు.