సాహో వరల్డ్ వైడ్ వన్ వీక్ కలెక్షన్స్

Published on Sep 06,2019 03:57 PM

ప్రభాస్ నటించిన సాహో వరల్డ్ వైడ్ గా మొదటి వారంలో 370 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించింది. ఆగస్టు 30 న విడుదలైన సాహో చిత్రానికి మొదటి నుండి ప్లాప్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది అయితే ఎంతగా ప్లాప్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. మొత్తంగా వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 370 కోట్ల గ్రాస్ వసూల్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది.

మొదటి రోజున 104 కోట్లు సాధించిన సాహో ఆ తర్వాత తన జోరుని కాస్త తగ్గిస్తూ మూడు రోజుల్లో 330 కోట్లు వసూల్ చేసింది అయితే నాల్గో రోజు నుండి సాహో వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఇక ఇప్పుడు మొదటి వారం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మరింతగా నీరుగారిపోవడం ఖాయం. మొత్తానికి సాహో 400 కోట్ల నుండి 420 కోట్ల మధ్య వసూళ్లు ఆగిపోయేలా కనిపిస్తోంది. అంటే ఈ సినిమాని కొన్న బయ్యర్లు పెద్ద మొత్తంలో నష్టపోవడం ఖాయం అన్నమాట.