సాహో నష్టం ఎంత

Published on Sep 07,2019 02:24 PM

ప్రభాస్ నటించిన సాహో భారీ నష్టాలను మిగుల్చుతోంది ఆ సినిమాని కొన్న బయ్యర్ లను. ఆగస్టు 30 న రిలీజ్ అయిన సాహో భారీ ఓపెనింగ్స్ అయితే సాధించింది కానీ ఆ తర్వాత చతికిలబడింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 370 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించింది. దాంతో ఈ సినిమాని కొన్న బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే కనీసం మరో 150 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించాలి లేదంటే బయ్యర్లకు తీవ్ర స్థాయిలో నష్టాలు రావడం ఖాయం.
హిందీలో ఈ సినిమాని కొన్నవాళ్లకు పెద్దగా లాభాలు రావడం లేదు కానీ పెట్టిన పెట్టుబడి మాత్రం వస్తోంది అంటే వాళ్ళు సేఫ్ అవుతున్నారు. కానీ మిగతా అన్ని చోట్లా నష్టాలు వస్తున్నాయి. ఈ నష్టాల తీవ్రత ఎంతంటే ....... 60 నుండి 100 కోట్ల నష్టాలు వచ్చేలా ఉన్నాయని అంటున్నారు. ఇంతటి స్థాయిలో నష్టాలు అంటే చిత్ర నిర్మాణ సంస్థ పై భారం అనే చెప్పాలి .