సాహో ప్లాప్ అంటూ రివ్యూ ఇచ్చాడు

Published on Aug 30,2019 10:47 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ప్లాప్ అంటూ తేల్చేసాడు క్రిటిక్ శివ సత్యం. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటించిన ఈ చిత్రం ఈరోజు విడుదల అవుతుండగా నిన్ననే సాహో చిత్రం ప్లాప్ అంటూ రివ్యూ ఇచ్చేసాడు క్రిటిక్ శివ సత్యం. 

సాహో చిత్రం నిన్ననే చూశానని, సినిమా బోరింగ్ గా ఉందని ఒక్కమాటలో చెప్పాలంటే ప్లాప్ అంటూ ట్వీట్ చేయడమే కాకుండా తలనొప్పి నుండి తప్పించుకోవాలంటే సాహో చూడకండి అంటూ ఉచిత సలహా ఇచ్చాడు శివ సత్యం. సాహో ని కొన్న వాళ్ళు తీవ్రంగా నష్టపోవడం ఖాయమని అంటున్నాడు. శివ సత్యం ఇచ్చిన రివ్యూ తో ప్రభాస్ అభిమానులు అతడిపై రెచ్చిపోతున్నారు , బూతుల వర్షం కురిపిస్తున్నారు.