సాహో ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Published on Sep 06,2019 11:39 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ల నే సాధిస్తోంది. అయితే సినిమా మేకింగ్ కు 350 కోట్లు ఖర్చు పెట్టడంతో ఇది దాదాపుగా ప్లాప్ అనే చెప్పాలి. కాకపోతే భారీ ఓపెనింగ్స్ ని అయితే సాధించింది. సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటించింది. ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించిన సాహో రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం 74 కోట్ల షేర్ ని సాధించింది.
తెలంగాణ                      -   26 . 22 కోట్లు( షేర్ )
సీడెడ్                             -  10. 78 కోట్లు
కృష్ణా                              -  4. 70 కోట్లు
గుంటూరు                        - 7. 46 కోట్లు
ఉత్తరాంధ్ర                      -   8. 93 కోట్లు
ఈస్ట్                                 -  6. 90 కోట్లు
వెస్ట్                                  -  5. 30 కోట్లు
నెల్లూరు                           -  3. 89 కోట్లు
మొత్తం                            - 74 . 18 కోట్ల షేర్