బయ్యర్ లను 110 కోట్లకు ముంచిన సాహో

Published on Sep 13,2019 12:58 PM

సాహో చిత్రాన్ని కొన్న బయ్యర్లు ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల మేర నష్టపోయారు. ప్రపంచ వ్యాప్తంగా సాహో 320 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా ఇప్పటివరకు 208 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇక మరింత సొమ్ము రావడం దాదాపుగా కష్టమే కాకపోతే కిందా మీదా పడినా మరో 2 కోట్లకు మించి రాదు ఒకవేళ అలా వస్తే మొత్తంగా 210 కోట్ల షేర్ అవుతుంది అంటే 110 కోట్ల నష్టం అన్నమాట ప్రపంచ వ్యాప్తంగా కొన్న బయ్యర్లకు.

ఇక పెద్ద మొత్తంలో ఓవర్ సీస్ బయ్యర్ నష్టపోతున్నాడు, అక్కడ ఈ సినిమా 20 కోట్లు మాత్రమే రాబట్టింది అంటే 21 కోట్ల నష్టం అన్నమాట ఓవర్ సీస్ లో . అలాగే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర ప్రాంత బయ్యర్లు కూడా తీవ్రంగా నష్టపోయారు దాంతో ఈ భారీ నష్టాలను తమ తదుపరి చిత్రాలతో భర్తీ చేయనున్నారు ప్రభాస్ , యువి క్రియేషన్స్.