సాహో డిజాస్టర్ తో రోడ్డున పడనున్న బయ్యర్లు

Published on Aug 31,2019 10:55 AM
నిన్న విడుదలైన సాహో చిత్రానికి డిజాస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాని భారీ రేట్లకు కొన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయేలా ఉన్నారు. తీవ్రంగా నష్టపోతే కొంతమంది బయ్యర్లు రోడ్డున పడటం ఖాయం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో చిత్రం పై మొదటి నుండి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ బడ్జెట్ అవసరమా ? అని ప్రశ్నలు సంధించారు పలువురు. నేల విడిచి సాము చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 

ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టినవాళ్ళు కనీసం ఒక కోటి రూపాయలు కథ కోసం ఖర్చు పెట్టి ఉంటే బాగుండేదని సెటైర్ లు వేస్తున్నారు. కానీ అదే నిజం ........ ఎంతసేపు 300 కోట్ల బడ్జెట్ , 350 కోట్ల బడ్జెట్ ...... భారీ యాక్షన్ సీన్స్ ..... పాన్ ఇండియా సినిమా అంటూ ఊకదంపుడు ప్రచారం చేశారు కానీ కథ , స్క్రీన్ ప్లే మీద కాస్త దృష్టి పెడితే సాహో ఖచ్చితంగా మరో లెవల్ లో ఉండేది. భారీ బడ్జెట్ సినిమా అంటూ భారీ రేట్లకు కొన్న బయ్యర్లు ఇప్పుడు ఘోరంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. కాకపోతే గుడ్డిలో మెల్ల లాగా ఓపెనింగ్స్ మాత్రం బాగా వస్తున్నాయి. అదొక్కటే కొంచెం రిలీఫ్.