4 రోజుల్లో 330 కోట్లు వసూల్ చేసిన సాహో

Published on Sep 04,2019 10:14 AM

ప్రభాస్ నటించిన సాహో చిత్రం 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 330 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది. దాంతో మరో 300 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే ఈ సినిమాని కొన్న బయ్యర్లకు పెట్టిన పెట్టుబడి వస్తుంది అంటే అప్పుడు లాభపడ్డట్లే ! కానీ సాహో చిత్రాన్ని చూడాలన్న కుతూహలం సినిమా విడుదలకు ముందు ఉంది కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ ల రూపంలో ఈ భారీ మొత్తం వచ్చింది. 
కానీ ఇప్పుడు సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది కాబట్టి కలెక్షన్లు పడిపోయాయి దాంతో మరో 300 కోట్ల వసూళ్లు సాధించడం కష్టమే సాహో చిత్రానికి. సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మించిన సాహో భారీ ఓపెనింగ్స్ సాధించింది. అయితే బోరింగ్ సీన్స్ , స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో సాహో కు ఈ ఇబ్బందులు వచ్చిపడ్డాయి. బాహుబలి తర్వాత వచ్చిన ఈ సాహో ప్రభాస్ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది.