బాహుబలి రికార్డ్ ని బద్దలు కొట్టిన సాహో

Published on Aug 24,2019 11:12 AM

బాహుబలి రికార్డ్ ని ఇంకా విడుదల కాకుండానే బద్దలు కొట్టింది సాహో చిత్రం . ప్రభాస్ హీరోగా నటించిన సాహో ఆగస్టు 30 న విడుదల అవుతుండగా ఆ సినిమాపై స్కై లెవల్లో అంచనాలు ఏర్పడ్డాయి . దాంతో తమిళనాడులో సాహో కోసం ఏకంగా 550 థియేటర్ లు ఇస్తున్నారు . అనితర సాధ్యమైన బాహుబలి తమిళనాట 525 థియేటర్ లలో విడుదల కాగా సాహో ఏకంగా 550 థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల అవుతోంది దాంతో బాహుబలి రికార్డ్ బద్దలై పోతోంది . 

సాహో పేరిట కొత్త రికార్డ్ నమోదు కానుంది . అయితే ఆగస్టు 30 న సినిమా విడుదలైన తర్వాత అసలు రికార్డులు తేలనున్నాయి . భారీ ఓపెనింగ్స్ అయితే సాహో కొల్లగొట్టడం ఖాయమైపోయింది . సెన్సార్ కార్యక్రమాలు పూర్తికావడంతో ఇక అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కానుంది .