రవితేజ పై సెటైర్ వేసిన ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్

Published on Sep 04,2019 11:04 AM

హీరో రవితేజ పై చీప్ స్టార్ అంటూ సెటైర్ వేసాడు ఆర్ ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం సాధించిన అజయ్ భూపతి తన రెండో చిత్రాన్ని రవితేజ హీరోగా మహాసముద్రం అనే టైటిల్ తో తీయడానికి రెడీ అయ్యాడు. అయితే మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ ఆ తర్వాత రకరకాల కారణాలు చెబుతుండటంతో మహాసముద్రం ప్రాజెక్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. 
రవితేజ వ్యవహారశైలితో విసిగిపోయిన దర్శకులు అజయ్ భూపతి సోషల్ మీడియాలో చీప్ స్టార్ అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. అయితే ఈమాట నేరుగా రవితేజ పై చేశాడా ? లేక మరొకరిపైనా అన్నది మాత్రం అనుమానంగా మారింది. రవితేజ హ్యాండ్ ఇవ్వడంతో మహాసముద్రం ప్రాజెక్ట్ ని మరో హీరోతో చేయాలనీ చూస్తున్నాడు అజయ్ భూపతి.