మాఫియా నేపథ్యంలో ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ తదుపరి చిత్రం

Published on Feb 06,2019 03:58 PM

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం సాధించిన దర్శకుడు అజయ్ భూపతి తన తదుపరి చిత్రాన్ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మహా సముద్రం అనే చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం . గత ఏడాది విడుదలైన ఆర్ ఎక్స్ 100 చిత్రం భారీ విజయం సాధించి 20 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది . 

ఆ సినిమా ఇచ్చిన బూస్ట్ తో అజయ్ భూపతికి చాలా అవకాశాలు వచ్చి పడ్డాయి అయితే భారీ రెమ్యునరేషన్ తో పాటు భారీ బడ్జెట్ పెట్టడానికి ముందుకు రావడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో తన తదుపరి సినిమా చేయడానికి రెడీ అయ్యాడు . తెలుగు సినిమా రంగంలో ద్వితీయ విఘ్నం ని చేధించిన వాళ్ళు కొంతమందే మరి అజయ్ భూపతి ఆ సెంటిమెంట్ ని బద్దలు కొడతాడా చూడాలి .