విలన్ పాత్రలో ఆర్ ఎక్స్ 100 హీరో

Published on Feb 08,2019 02:27 PM

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన హీరో కార్తికేయ . చిన్న చిత్రంగా రిలీజ్ అయిన ఆర్ ఎక్స్ 100 వసూళ్ల సునామి సృష్టించింది . దాంతో కార్తికేయ కు వెల్లువలా అవకాశాలు వచ్చి పడుతున్నాయి . తాజాగా తమిళ , తెలుగు బాషలలో హిప్పీ అనే చిత్రంలో నటిస్తున్న కార్తికేయ కు నాని సినిమాలో నటించే అవకాశం వచ్చిందట . 

అక్కినేని కుటుంబంతో మనం వంటి బ్లాక్ బస్టర్ ని అందించిన దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని భారీ బడ్జెట్ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే . కాగా ఆ సినిమాలో కార్తికేయ ని విలన్ గా నటించమని కోరారట దర్శకుడు విక్రమ్ కుమార్ . హీరోగా నటిస్తూ విలన్ గా చేయాలా ? వద్దా ? అనే డైలమాలో ఉన్నాడట ఈ హీరో . అయితే మంచి అవకాశం కాబట్టి తప్పకుండా ఆలోచిస్తానని అంటున్నాడట కార్తికేయ .