సమంత పై పుకార్లు

Published on Mar 07,2020 01:38 PM

హీరోయిన్ సమంత పై పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ భామపై వస్తున్న పుకార్లలో ఏది నిజం అనేది తెలియాలంటే సమంత స్పందించాల్సిందే. ఇంతకీ సమంత పై వస్తున్న పుకార్లు ఏంటో తెలుసా ....... ప్రస్తుతం సమంత గర్భం దాల్చిందని , అందుకే సినిమాలు అంతగా ఒప్పుకోవడం లేదని ఒక పుకారు షికారు చేస్తోంది . అలాగే తమిళ హీరోయిన్ నయనతార తో సమంత కు గొడవ జరిగిందని కూడా.

నయనతార ప్రధాన పాత్రలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ తమిళ చిత్రం రూపొందుతోంది. విజయ్ సేతుపతి హీరో కాగా నయనతార మెయిన్ హీరోయిన్ అలాగే అదే సినిమాలో మరో హీరోయిన్ గా సమంత కూడా నటిస్తోంది. అయితే అక్కడ షూటింగ్ లో నయనతార తో గొడవ కావడంతో ఆ తమిళ చిత్రానికి గుడ్ బై చెప్పిందని వార్తలు వస్తున్నాయి. అలాగే సమంత తల్లి కాబోతోంది కాబట్టే చేతిలో ఉన్న సినిమాలను వదులుకుంటోంది అలాగే కొత్త సినిమాలను అంగీకరించడం లేదు అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి ఏంటో .