రజనీకాంత్ కూతురు రెండో పెళ్లి పై దుమారం

Published on Jan 24,2020 09:38 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య రజనీకాంత్ రెండో పెళ్లి చేసుకోవడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. రజనీకాంత్ కు ఇద్దరు కూతుర్లు కాగా పెద్ద కూతురు ఐశ్వర్య ని హీరో ధనుష్ కు ఇచ్చి పెళ్లి చేసాడు. ఇక రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ కు సినిమాలు డైరెక్షన్ చేయడం అంటే ఇష్టం దాంతో ఆమె రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది కానీ ఆ రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి దాంతో సైలెంట్ అయిపొయింది.

సౌందర్య రజనీకాంత్ మొదట అశ్విన్ రాంకుమార్ ని పెళ్లి చేసుకుంది. ఆ ఇద్దరికీ ఒక బాబు కూడా అయితే బాబు పుట్టాక ఇద్దరి మధ్య తీవ్ర విబేధాలు వచ్చాయి దాంతో విడాకులు తీసుకున్నారు. గత ఏడాది సౌందర్య మళ్ళీ పెళ్లి చేసుకుంది నటుడు , వ్యాపారవేత్త అయిన విశాగన్ వనాంగముడి అనే అతడిని. అయితే ఈ విషయం ఇప్పుడు అక్కడ దుమారం రేగడానికి కారణం రజనీకాంత్ పెరియార్ పై విమర్శలు చేయడమే. దాంతో రజనీ ని టార్గెట్ చేయాల్సింది పోయి రజనీకాంత్ రెండో కూతురు రెండో పెళ్లిపై కామెంట్స్ చేస్తున్నారు ప్రత్యర్ధులు.