మహేష్ బాబు పై పుకార్లు

Published on Apr 03,2019 04:54 PM

మహేష్ బాబు బాలీవుడ్ కి వెళ్తున్నాడు అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి . ఇన్నేళ్ల కెరీర్ లో మహేష్ బాబు టాలీవుడ్ కే పరిమితం అయ్యాడు కానీ బాలీవుడ్ పై దృష్టి పెట్టింది లేదు , అసలు అలాంటి ఆలోచన కూడా ఎప్పుడూ చేయలేదు ఎందుకంటే టాలీవుడ్ లో మహేష్ బాబు సూపర్ స్టార్ , ఇక్కడ నెంబర్ వన్ హీరో అలాంటిది బంగారం లాంటి టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కు ఎందుకు వెళ్తాడు ? 

పైగా మహేష్ పలు సందర్భాల్లో నాకు బాలీవుడ్ చిత్రాలు చేయాలన్న ఆసక్తి , ఉత్సాహం లేదని చెప్పాడు కూడా కానీ ఎప్పటికప్పుడు మహేష్ బాలీవుడ్ ఎంట్రీ గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి . తాజాగా మరోసారి మహేష్ బాలీవుడ్ సినిమా గురించి పుకార్లు షికారు చేస్తున్నాయి . మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . మే 9 న మహర్షి భారీ ఎత్తున రిలీజ్ కానుంది .