అనుష్కపై పుకార్లు

Published on Apr 22,2020 04:52 PM
సాలిడ్ అందాల భామ అనుష్క పై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి దాంతో '' నిశ్శబ్దం '' చిత్ర యూనిట్ స్పందించింది ఆ పుకార్లపై. ఇంతకీ అనుష్క పై వస్తున్న పుకార్లు ఏంటో తెలుసా ....... నిశ్శబ్దం చిత్రం పై అంతగా నమ్మకం లేని అనుష్క ఆ సినిమా ప్రమోషన్ కు అంతగా సహకరించడం లేదని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలు మరింతగా ఎక్కువ కావడంతో ఎట్టకేలకు నిశ్శబ్దం చిత్ర యూనిట్ స్పందించి అనుష్క మాకు అన్నిరకాల సహకారం అందిస్తోందని తెలిపారు.

మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క తో పాటుగా తమిళ హీరో మాధవన్ , అంజలి , షాలిని పాండే కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ్ సన్ తదితరులు నటించారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండే కానీ రకరకాల కారణాల వల్ల సినిమా ఆలస్యం అయ్యింది. ఇక ఏప్రిల్ 1 న విడుదల చేయాలని అనుకున్నారు ఈలోపున కరోనా వచ్చింది దాంతో ఈ సినిమా విడుదల డైలమాలో పడింది.