అమితాబ్ ఆరోగ్యంపై పుకార్లు

Published on May 02,2020 03:33 PM
లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడని , పరిస్థితి విషమంగా ఉందని రకరకాల పుకార్లు షికారు చేసాయి ముంబైలో. ఈరోజు ఉదయం అమితాబ్ అస్వస్థతకు లోనయ్యాడు అంటూ పుకార్లు షికారు చేయడంతో బాలీవుడ్ లో కలకలం చెలరేగింది. ఎందుకంటే ఇటీవలే బాలీవుడ్ కి చెందిన ఇద్దరు సీనియర్ నటులు రిషి కపూర్ , ఇర్ఫాన్ ఖాన్ తో పాటుగా మరో నిర్మాత కూడా చనిపోయాడు దాంతో రెండు రోజుల్లోనే ముగ్గురు మరణించడంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి.

ఇక ఇప్పుడేమో అమితాబ్ ఆసుపత్రి పాలయ్యాడు అంటూ పుకార్లు రావాడంతో అవన్నీ పుకార్లు మాత్రమే అని కొట్టిపడేసారు అమితాబ్ కుటుంబ సభ్యులు. అమితాబ్ బచ్చన్ కు ఎలాంటి అనారోగ్యం లేదని , లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్నాడని ప్రజలు పుకార్లని నమ్మొద్దని తెలిపారు. 77 సంవత్సరాల అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మెగాస్టార్ అన్న సంగతి తెలిసిందే.