విజయ్ దేవరకొండ సినిమాపై పుకార్లు

Published on Feb 03,2020 12:12 PM

విజయ్ దేవరకొండ తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం విడుదలకు సిద్దమైన విషయం తెలిసిందే. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఈనెల 14 న విడుదల అవుతుండగా ఆ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తూ పుకార్లు షికారు అయ్యేలా చేస్తున్నారు. నిజానికి వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి అంతగా బజ్ లేదు దాంతో ఈ సినిమాకు పెద్దగా థియేటర్ లు కూడా దొరకడం లేదు. తక్కువ థియేటర్ లోనే ఈ సినిమా విడుదల అవుతోంది.

రాశి ఖన్నా , కేథరిన్ ట్రెసా , ఐశ్వర్య రాజేష్ , ఇసా బెల్లె అనే నలుగురు అందమైన భామలు హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. అయితే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఈమధ్య ప్లాప్ అయ్యాయి దాంతో ఈ సినిమాకు అంతగా బజ్ క్రియేట్ కాలేదు. ఇక విజయ్ దేవరకొండ రంగంలోకి దిగితే కానీ తెలీదు ఈ సినిమాపై అంచనాలు పెరుగుతాయా ? లేదా ? అన్నది. ప్రస్తుతానికైతే వరల్డ్ ఫేమస్ లవర్ పై అంతగా బజ్ లేదు.