అర్జున్ రెడ్డి డైరెక్టర్ తదుపరి సినిమాపై పుకార్

Published on Dec 07,2019 02:35 PM

అర్జున్ రెడ్డి , కబీర్ సింగ్ చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తదుపరి చిత్రంపై పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతకీ ఆ పుకార్లు ఏంటంటే ........ సందీప్ రెడ్డి వంగా సినిమా నుండి బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తప్పుకున్నాడని. అయితే బాలీవుడ్ లో ఈ పుకార్లు షికారు చేస్తున్నాయి కానీ అటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కానీ ఇటు హీరో రణబీర్ కపూర్ కానీ ఈ వార్తలను ఖండించలేదు దాంతో ఈ వార్తలకు మరింత ఊపొచ్చింది.

అర్జున్ రెడ్డి తెలుగులో సంచలన విజయం సాధించడంతో అదే చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసాడు. అక్కడ పెద్ద ఎత్తున విమర్శలతో పాటుగా బాక్సాఫీస్ ని కొల్లగొట్టింది కబీర్ సింగ్. దాంతో సందీప్ రెడ్డి వంగా కు ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది. ఇంకేముంది తన తదుపరి చిత్రాన్ని కూడా బాలీవుడ్ లోనే చేయాలనీ ఫిక్స్ అయ్యాడు హీరో రణబీర్ కపూర్ కూడా సెట్ అయ్యాడు. అయితే ఈలోపు ఆ ప్రాజెక్ట్ నుండి రణబీర్ కపూర్ తప్పుకున్నట్లు పుకార్లు వస్తున్నాయి. మరి దీనిపై ఎవరు క్లారిటీ ఇస్తారో ?