ప్రపంచ వ్యాప్తంగా 10 భాషలలో ఆర్ ఆర్ ఆర్

Published on Nov 22,2019 10:48 PM

తెలుగు , తమిళ్ , మలయాళం , హిందీ , ఇంగ్లీష్ తో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 10 భాషలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ , కోలీవుడ్ , మోలీవుడ్ , హాలీవుడ్ నటీనటులను ఎందుకు తీసుకున్నాడో తెలుసా ....... ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ భాషలలో విడుదల చేయడానికే.

బాహుబలి చిత్రంతో రాజమౌళి ఖ్యాతి ప్రపంచ వ్యాప్తం అయ్యింది అందుకే ఆ అవకాశాన్ని మరింతగా పెంచుకోవాలనే ధృడ సంకల్పంతో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఎక్కువ భాషలలో రిలీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలై లో విడుదల కానుంది. ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ భామ ఒలివియా మోరిస్ ని ఎంపిక చేసాడు జక్కన్న. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ భాషలలో విడుదల చేయడం ద్వారా భారీ వసూళ్ల పై దృష్టి పెట్టాడు జక్కన్న